బాలీవుడ్ సినిమాలు అందుకే సక్సెస్ కాలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రిషబ్ శెట్టి!

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లను వసూలు చేస్తూ ఘన విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే సంచలనం సృష్టించిన కేజీఎఫ్ పార్ట్ 1,2 తర్వాత రెండవ అతి పెద్ద కన్నడ చిత్రంగా కాంతార సినిమా రికార్డు క్రియేట్ చేసి కన్నడ సినీ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచిందని సినీ విశ్లేషలకు చెబుతున్నారు.

తాజాగా హీరో రిషబ్ శెట్టి హిందుస్థాన్ టైమ్స్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో రూపొందించే బాలీవుడ్ చిత్రాలు వరుసగా పరాజయం కావడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పరోక్షంగా సినీ నిర్మాత, దర్శకుల పై కూడా వ్యంగ్యంగా చురకలు అందించాడు. ఒక సినిమాను నిర్మించేటప్పుడు మన వ్యక్తిగత ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకోకుండా మనము ప్రేక్షకుల స్థానంలో ఉండి ఆలోచించి సినిమాలు నిర్మిస్తే అద్భుత విజయాలు అందుకుంటామని చెప్పారు.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది మూవీ మేకర్స్ హాలీవుడ్ సినిమా కథలను మరి ఇతర కథలను పెరికెక్కించడానికి ఆసక్తి చెబుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మన ప్రాంత జీవన విధానం మన ప్రేక్షకుల ఆలోచన విధానం దృష్టిలో ఉంచుకొని ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలను నిర్మించినప్పుడే మన సినీ ఇండస్ట్రీ స్థాయి పెరుగుతుందని చెప్పారు.

కాంతార సినిమా విషయానికొస్తే ఈ సినిమా 1847లో ప్రజల జీవన విధానాన్ని, అప్పటి రాజరిక ప్రభుత్వానికి
ప్రజలకు మధ్య ఆధిపత్య పోరాటాన్ని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాకుండా కేరళ,కర్ణాటక ఆదివాసీల పురాతన సాంప్రదాయ జానపద కల అయినా భూతకోల వృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి రిషబ్ శెట్టి నటనపరంగా దర్శకత్వం పరంగా ప్రశంసలు పొందారు.