ప్చ్.. చప్పగా ఈసారి ప్రభాస్ బర్త్ డే..!

ఓ స్టార్ హీరో కి సంబంధించిన బర్త్ డే వస్తుంది అంటే ఆ హంగామా ఎలా ఉంటుంది అందులోని మన సౌత్ లో కానీ తెలుగు హీరోస్ కి అయితే ముందు రోజు నుంచే రచ్చ రంబోలాతో మోగిపోతుంది. కానీ ఈసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి హీరో విషయానికి వస్తే ఎందుకో అంతా చాలా డల్ గా కొనసాగుతుంది.

కాగా ఏ హీరో బర్త్ డే అయినా కూడా ముందు రోజు నుంచే తన సినిమాలకి సంబంధించి ఏవోక అప్డేట్స్ తో ముందు రోజు నుంచే హంగామా స్టార్ట్ అవుతుంది కానీ ఈసారి ప్రభాస్ బర్త్ డే అలాంటివి ఏవి పెద్దగా కనిపించడం లేదు. కాగా ఆఫ్ లైన్ లో అయితే గ్రాండ్ గా బర్త్ డే వేడుకలు భారీ కటౌట్ తో ప్లాన్ చేస్తున్నారు.

కాని సోషల్ మీడియా ఫ్యాన్స్ లో మాత్రమే ఎందుకో ఈసారి ఎలాంటి జోష్ కనిపించడం లేదు. దీనితో ఈ ఏడాది బర్త్ డే మాత్రం ప్రభాస్ విషయంలో చెప్పగానే ఉందని చెప్పాలి. అయితే రేపు అక్టోబర్ 23 కి ప్రభాస్ ఛత్రపతి రీ రిలీజ్ ఒకటి మినహా ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఏమొస్తాయి అనేది ఇంకా ఇవ్వకపోవడం ఫ్యాన్స్ ఉత్సాహాన్ని నీరు గారుస్తున్నాయి.

మరి రేపు కూడా వారిని ఎగ్జైట్ చేసే అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ రాలేదు అంటే ఈసారి అంత డిజాస్టర్ బర్త్ డే మరొకటి ఉండదు అని చెప్పాలి. మరి సలార్, కల్కి, స్పిరిట్ ఇంకా మారుతీతో ఓ సినిమా ఉంది తాను చేయాల్సినివి కూడా ఉన్నాయి వీటి అన్నిటి నుంచి అప్డేట్స్ ఏమన్నా వస్తాయో లేదో చూడాలి.