Mega Star Chiranjeevi: మెగాస్టార్ #154 లో మాస్ మహా రాజా పాత్ర ఇదే…!

Mega Star Chiranjeevi: మెగాస్టార్ మళ్ళీ జోరు పెంచి వరుసగా సినిమాలను చేస్తున్నారు. ఆచార్య షూటింగ్ తో బిజీగా ఉంటూనే తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు. భోళా శంకర్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు చిరంజీవి ఈ ఏడాది చివరకు ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక మహా శివరాత్రి సందర్బంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇక గాడ్ ఫాదర్ సెట్స్ లో కూడా పాల్గొంటున్నారు చిరంజీవి. ఈ క్రమంలోనే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిరంజీవి 154వ సినిమాలో మెగాస్టార్ తో పాటు రవితేజ నటించనున్నారు. అన్నయ్య సినిమాలో వీళ్లిదరు సోదరులుగా నటించిన ఇపుడు మాస్ మహారాజ్ రవితేజ, మెగాస్టార్ తో మరోసారి సినిమా చేస్తుండడం అటు మెగా అభిమానులను, ఇటు రవితేజ అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది.
ఈ సినిమాకు జై లవ కుశ ఫేమ్ బాబీ దర్శకత్వం వహించబోతున్నారు.మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఈ సినిమాలో ప్రధానంగా మెగాస్టార్ కి తమ్ముడిగా రవితేజ నటిస్తున్నారు. వీరి మధ్య సాగె సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. సినిమా షూటింగ్ అపుడే మొదలు పెట్టారు డైరెక్టర్ బాబీ. మెగాస్టార్ రవితేజల కాంబినేషన్ ఫ్యాన్స్ కు ఖచ్చితంగా కన్నులపండుగ అవుతుంది. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకొంటున్నారు లేకపోతే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా నెలలో విడుదల కానుంది.