Hero Sreekanth: మధురానగరి తర్వాత తనకు ఎలాంటి అవకాశాలు రాలేదని నటుడు శ్రీకాంత్ అన్నారు. హీరోగా చేశాను కదా.. కానీ ఒక్క సినిమా కూడా రావట్లేదేంటని చాలా సార్లు అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. మామూలుగా ఆ టైంలో ఎవరైనా అలానే అనుకుంటారు కదా అలానే తాను కూడా ఫీలయ్యినట్టు ఆయన చెప్పారు. ఆ సమయంలో మాత్రం తాను చాలా స్ట్రగుల్ అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటీ హీరోగా ఏం రావట్లేదు, కానీ విలన్‌గా అడుగుతున్నారు అని తాను ఆలోచనల్లో పడ్డుట్టు శ్రీకాంత్ తెలిపారు.
అప్పుడు తనకు వచ్చిన ఒకే ఒక ఆలోచన ఏంటంటే, ముందు ఇండస్ట్రీలో నిలబడడం కావాలి అని శ్రీకాంత్ చెప్పారు. తన బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఎవరూ లేరన్న ఆయన, ఏదైమైనా పర్లేదు అని ఫిక్స్ అయ్యి సీతారత్నం గారి అబ్బాయి సినిమాను ఒప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. అక్కడ్నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని, ఏ సినిమాలో, ఏ అవకాశమొచ్చినా చేసుకుంటూ వెళ్లిపోయానని ఆయన చెప్పారు.
కానీ కొన్ని సార్లు అలా విలన్ పాత్రల్లో నటిస్తున్నప్పుడు మాత్రం ఇంకా ఎన్నాళ్లు ఈ విలన్ క్యారెక్టర్లు చేస్తాను.. హీరోగా ఎప్పుడు చేస్తాను అని అనిపిస్తూ ఉండేదని శ్రీకాంత్ తెలిపారు. అలా అని విలన్ పాత్రలో చేస్తున్నపుడు ఇష్టం లేకుండా లేదా చిరాకుగా ఏం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఆ పాత్రకు న్యాయం చేకూరేందుకు కృషి చేసేవాడినని ఆయన చెప్పారు. ఇప్పటివరకు తాను లైఫ్‌లో చాలా ఒడిదుడులను ఎదుర్కొన్నానని ఆయన అన్నారు. లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంతే అని మనకు ఓ అవగాహన ఉంటే దేని గురించీ ఆలోచించమని ఆయన వివరించారు.