క్రికెటర్ గంగూలీ నటి నగ్మాను పీకల్లోతు ప్రేమించి ఆమెతో బ్రేకప్ చేసుకోవడానికి కారణం ఇదే!

సాధారణంగా క్రికెటర్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లను ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదా వారితో ఎఫైర్స్ పెట్టుకోవడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లను ప్రేమించే పెళ్లి చేసుకున్నారు మరి కొందరు వారి లవ్ కి బ్రేకప్ చెప్పుకున్నారు. అలాంటి వారిలో నటి నగ్మా ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేష ఆదరణ దక్కించుకున్నారు.

అదే సమయంలోనే క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ కలిసి విదేశాలకు వెళ్లడం ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగటం వల్ల అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే సౌరవ్ గంగూలీకి అప్పటికే తన చిన్ననాటి స్నేహితురాలు డోనా అనే అమ్మాయితో పెళ్లి జరిగింది.ఇక వీరిద్దరూ ప్రేమించుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నపటికీ ఇలాంటివి సర్వసాధారణమని భావించిన ఆమె ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు.

అయితే వీరిద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లిన సమయంలో వీరిద్దరి గురించి మీడియాలో చెప్పిన వార్తలను చూసి ఈమె ఈ విషయం గురించి గంగూలీని నిలదీసింది.ఈ క్రమంలోనే తనకు నాకు ఈ విధమైనటువంటి సంబంధం లేదని మీడియా ఎదుట చెబుతారా? లేకపోతే నన్ను విడాకులు ఇవ్వమంటారా అంటూ నిలదీయడంతో సౌరవ్ గంగూలీ నగ్మాతో తనకు ఉన్న ప్రేమకు బ్రేకప్ చెప్పారు.ఇలా తన ప్రేమకు బ్రేకప్ అయిందని నగ్మా ఒకనొక సందర్భంలో ఈ విషయాలను వెల్లడించారు.