ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సౌత్ ఇండియాలో అగ్రశ్రేణి హీరోయిన్ గా ఎదిగిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకొని నేషనల్ క్రష్ అనిపించుకుంటుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది ఈ భామ.
ప్రస్తుతం ఆమె రెయిన్ బో, ఛావా, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలలో నటిస్తోంది. అయితే ఈ మధ్య రష్మిక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఛావా సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఛావా సినిమా కోసం నన్ను వారి ఆఫీస్ కి పిలిపించి సినిమా చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పారు, అయితే దక్షిణాదికి చెందిన నేను మహారాష్ట్ర రాణిగా నటించగలనా అనుకున్నాను. అయితే స్క్రిప్ట్ విన్న వెంటనే సినిమాకి ఓకే చెప్పటానికి ఒక్క క్షణం కూడా పట్టలేదు.
నా జీవితంలో అతి తక్కువ సమయంలో ఒక ప్రాజెక్టుని అంగీకరించడం ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా మొత్తం ప్రేమమయమే, కధ, సంభాషణలే కాదు ఇందులో నటించిన వారంతా ప్రేమని పంచిన వారే అని చెప్పకొచ్చింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మొదట డిసెంబర్ 6న విడుదల చేయాలి అనుకున్నారు అయితే డిసెంబర్ 5న పుష్ప 2 సినిమా రిలీజ్ ఉండటంతో ఛావా సినిమా విడుదల వాయిదా పడింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఫిబ్రవరి 19 శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కాబోతుంది. శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ దీన్ని రూపొందించారు. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ మంచి ఆదరణ పొందింది. దీంతో సినిమాపై హైప్స్ బాగా పెరిగాయి. సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి.