సాధారణంగా మనిషి అన్న తర్వాత తప్పులు జరగడం సర్వసాధారణం అయితే కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో అదే తప్పులు తిరిగి పునరావృతం అవుతుంటాయి. ఇలా రెండోసారి తప్పు జరిగినప్పుడు ఎంతోమంది ఆ తప్పులను ఎత్తి చూపిస్తుంటారు.అయితే ఇలాంటి తప్పులు సాధారణమైన మనుషులు చేస్తే పెద్దగా పట్టించుకోరు కానీ సెలబ్రిటీలు కనుక చేస్తే పదేపదే వారు చేసిన తప్పులు గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు.ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ తన సినీ కెరియర్లో చేసిన తప్పు గురించి ఇప్పటికి తలుచుకొని బాధపడుతూ ఉంటారట.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా కొనసాగుతున్నటువంటి ఈయన కెరియర్ పట్ల వేసినటువంటి ఆ తప్పుటడుగులు ఏంటి అనే విషయానికి వస్తే… ఈయన హీరోగా కొనసాగుతున్న సమయంలో గుణశేఖర్ దర్శకత్వంలో వరుడు అనే సినిమాలో నటించారు.ఈ సినిమా విడుదల సమయంలో పెద్ద ఎత్తున సినిమాపై హైప్ క్రియేట్ చేసినప్పటికీ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.ఇక ఇందులో హీరోయిన్ ని చూపించకుండా సరాసరి థియేటర్లో చూపించాలని కాస్త ఎక్కువగానే చేశారు.
ఇక ఈ సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా బన్నీ తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్త పడాల్సి ఉండగా మరోసారి కూడా ఇలాంటి తప్పే చేశారు. ఈయన తన సినీ కెరియర్లో నటించినటువంటి మరొక సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమాలో కంటెంట్ లేకపోయినప్పటికీ అల్లు అర్జున్ ఈ సినిమాకి కమిట్ అవ్వడమే కాకుండా కంటెంట్ లేని సినిమాకి భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. అయితే ఈ సినిమాని కూడా ప్రేక్షకులు సున్నితంగా రిజెక్ట్ చేశారు. తన సినీ కెరియర్లో అల్లు అర్జున్ చేసినటువంటి ఈ తప్పుల గురించి ఇప్పటికి బాధపడుతుంటారని తెలుస్తోంది