‘సలార్’ బిగ్ సీక్రెట్ ఇదే!

రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’ గురించి ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. తాజాగా ఈ చిత్రం హక్కులకు సంబంధించి ఓ న్యూస్ వినిపిస్తోంది. సూపర్ ఫామ్ లో వరుస భారీ సినిమాలు చేస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. అందులో ఒకటి సలార్. ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతుండటంతో ఈ సినిమాపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రభాస్ ‘సలార్’ సినిమాతో ఆ సీన్ మళ్ళీ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తుండటం ఆసక్తికర అంశం. అయితే ఈ సినిమా ఒకటి కాదు రెండు పార్టులుగా రానుందని కన్ఫర్మ్ అయింది. అదెలా అంటే.. ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న దేవరాజ్ సలార్ రెండో పార్ట్ మీద హింట్ ఇచ్చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన నోరు జారారు. దీంతో సలార్ సెకండ్ పార్ట్ సీక్రెట్ రివీల్ అయింది. రెండో పార్టులోనే ప్రభాస్‌తో ఎక్కువగా తన సీన్లు ఎక్కువగా ఉంటాయని చెప్పడంతో అసలు విషయం బయటపడింది. సలార్ కోసం తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా యాక్షన్ సీన్స్ షూట్ చేశారట ప్రశాంత్ నీల్.

ఫిలిం నగర్‌లో నడుస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా విజువల్ ఫీస్ట్ కానుందని తెలుస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబో చిరకాలం గుర్తుండేలా ఈ చిత్రంలోని సీన్స్ ఉండనున్నాయట. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున ఈ సలార్ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ , ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషిస్తుండగా.. రవి బస్రూర్ బాణీలు కడుతున్నారు. హై టెక్నాలజీ ఉపయోగించి ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యేలా చూపించబోయే కొన్ని సీన్స్ ఈ సినిమాకు ప్రాణం కానున్నాయని సమాచారం. ఇకపోతే ఈ భారీ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ అయితే పీక్స్‌లో ఉండనుందని టాక్. ఈ భారీ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నారు.