“సలార్” బాలన్స్ ఇదొక్కటే..నిర్మాత కామెంట్స్.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా మార్కెట్ దగ్గర భారీ అంచనాలు ఉన్న బిగ్గెస్ట్ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఈ సినిమా షూటింగ్ భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతూ శరవేగంగా ఈ సినిమా కంప్లీట్ అవుతుంది.

ఇక మొన్ననే సినిమా నిర్మాత అలాగే హోంబేలె ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ కొన్ని సాలిడ్ స్టేట్మెంట్స్ సినిమాపై అందించగా ఇవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు సినిమా అయితే 80 శాతం కంప్లీట్ అయ్యిపోగా సినిమాలో ఇప్పుడు ఒక్క క్లైమాక్స్ ఒక్కటి మాత్రమే బాలన్స్ ఉందని దానిని నీల్ అతి త్వరలోనే కంప్లీట్ కానున్నట్టుగా తెలిపారు.

దీనితో ఈ సినిమాలో ఒక్క క్లైమాక్స్ మినహా మిగతా షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది అని చెప్పాలి. ఇక క్లైమాక్స్ తో అయితే సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇది వరకే ఈ సినిమాకి ఒకటే కాకుండా ఎక్కువ సీక్వెల్స్ కూడా ఉంటాయని తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది.