టాలీవుడ్ నటి సమంత గత కొద్ది రోజులుగా మయూసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.ఇలా ఈమె అనారోగ్య సమస్య కారణంగా ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలన్నింటికీ కూడా కాస్త బ్రేక్ ఇచ్చి పూర్తిగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఇప్పుడు ఇప్పుడే తన అనారోగ్యం నుంచి కాస్త కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే సమంత తాను బాధపడుతున్న మైయోసైటిస్ వ్యాధి గురించి తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు సినీ సెలబ్రిటీలు షాక్ అయ్యారు.
సమంత మయోసాటిసిస్ అనే ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతున్నారని తెలియగానే వెంటనే సినీ సెలబ్రిటీలందరూ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకోవడమే కాకుండా తనకు ఎంతో ధైర్యాన్ని నింపారు. ఇక అభిమానులు సైతం సమంత క్షేమంగా బయటపడాలని ప్రార్థించారు. ఇకపోతే సమంత అనారోగ్య సమస్య గురించి నటి శ్రీయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీ మాట్లాడుతూ సమంత స్ట్రాంగ్ ఉమెన్. తను తొందరగా ఈ వ్యాధితో ఫైట్ చేసి బయటపడుతుందని,ఆమె జీవితంలో ఇది ఒక చిన్న దశ అంటూ సమంత గురించి శ్రీయ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత శ్రియ ఇద్దరు కలిసి అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన మనం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రియ ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.