ఆస్కార్ రేస్ నుంచి తప్పుకున్న ఈ ఇండియన్ హిట్ సినిమా.. 

వరల్డ్ వైడ్ సినిమా దగ్గర మోస్ట్ పాపులర్ మరియు మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు ఏదైనా ఉంది అంటే అది ఆస్కార్ అవార్డు మాత్రమే అని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆస్కార్ అవార్డు మన ఇండియన్ సినిమాకి రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. అలాగని ఇండియన్ సినిమా నుంచి బెస్ట్ సినిమా క్యాటగిరీ లో కూడా అవార్డు రాలేదు.

ఒక్క ఆర్ ఆర్ ఆర్ సినిమాకి గాను మొదటి సారిగా ఓ సాంగ్ కి రెండు ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. దీనితో ఇక నుంచి ఇండియన్ సినిమాకి కూడా ఆస్కార్ ఆశలు చిగురించాయి. అంతే కాకుండా అక్కడ నుంచి కంటెంట్ తో వచ్చిన అనేక చిత్రాలు ఆస్కార్ కి కూడా తమ సినిమాలు పంపిస్తామని చెప్పారు.

అలాగే ఇండియా ఫెడరేషన్ నుంచి అయితే కొన్ని సినిమాలు ఈ ఏడాది పంపించారు. అలా పంపిన వాటిలో ఈ ఏడాది మలయాళ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన చిత్రం “2018” కూడా ఒకటి. యంగ్ హీరో తోవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమా 2018 వరదల నేపథ్యంలో ఓ ఎమోషనల్ డ్రామాగా అయితే దీనిని తెరకెక్కించారు.

అయితే ఈ సినిమాని ఆస్కార్ కి పంపినప్పుడు చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఇపుడు అనూహ్యంగా ఈ సినిమా ఆస్కార్ లిస్ట్ లో నామినేట్ కాలేదని తెలుస్తుంది. దీనితో ఈ సినిమా ఆస్కార్ రేస్ లో లేనట్టు అయ్యింది. దీనితో మూవీ లవర్స్ కొంచెం డిజప్పాయింట్ అయ్యారు.