ఇండస్ట్రీ టాక్ : “దేవర” తప్పుకునేందుకు ఇలా ఛాన్స్ ఉందా??

ఈ ఏడాదిలో మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు సినిమా నుంచి గర్వించదగ్గ మరియు చెప్పుకోదగ్గ భారీ చిత్రాలు వరుసగా రానున్నాయి. ఆల్రెడీ హనుమాన్ హవాతో మరోసారి తెలుగు సినిమా పేరు పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా వినిపిస్తుండగా ఈ తర్వాత టాలీవుడ్ నుంచి రానున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఏదన్నా ఉంది అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమా “దేవర పార్ట్ 1” కూడా ఒకటి.

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం హాలీవుడ్ లెవెల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుండగా చిత్ర యూనిట్ నిన్న కూడా సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని ఏప్రిల్ 5ని ఫిక్స్ చేశారు. కాగా చిత్ర యూనిట్ దీనికే లాక్ అయ్యి ఉన్నప్పటికీ సినిమాపై ఏపీ ఎన్నికల ప్రభావం కనుక ఉంటే ఆ డేట్ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఒకవేళ కానీ ఎన్నికలు అటు ఇటు అయితే లాంగ్ రన్ నిమిత్తం దేవర డేట్ మార్చొచ్చు అట. ఒకవేళ లేనట్టయితే ఫ్యాన్స్ ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదని సినిమా అనుకున్నట్టే ఏప్రిల్ 5న వస్తుంది అని సమాచారం. సో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు అనే దానిపై దేవర రిలీజ్ అయితే ఇప్పుడు ఆధారపడి ఉందని చెప్పాలి. ఇక ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.