గాసిప్స్ : “డబుల్ ఇస్మార్ట్” ఈ హాట్ బ్యూటీ ఉండదా??

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రానున్న కొన్ని ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రాల్లో రీసెంట్ గా టాలీవుడ్ సినిమా నుంచి అనౌన్స్ అయ్యిన క్రేజీ ప్రాజెక్ట్ “డబుల్ ఇస్మార్ట్” కూడా ఒకటి. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్న ఈ చిత్రం అనౌన్స్ అయ్యి క్రేజీ హైప్ తెచ్చుకుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ అవైటెడ్ సినిమాకి ముందు వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” భారీ హిట్ కాగా దీనికి ఇపుడు సీక్వెల్ అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కావాల్సి ఉండగా ఈ చిత్రంపై సంబంధించి ఓ షాకింగ్ గాసిప్ అయితే వినిపిస్తుంది.

కాగా మొదటి సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఉన్న చాలా కారణాల్లో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఒక కారణం. తన గ్లామ్ షో యూత్ ని అప్పట్లో బాగా అట్రాక్ట్ చేసింది. దీనితో ఈ సినిమా విజయంలో ఆమె కూడా కారణం కాగా ఇపుడు ఊహించని విధంగా పార్ట్ 2 లో అయితే ఆమెని తప్పించినట్టుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈమె కానీ లేకపోతె చాలా వరకు యూత్ లో ఆసక్తి ఈ సినిమాపై తగ్గిపోతుంది అని చెప్పొచ్చు. మరి నిధి పరిస్థితే ఇలా ఉంటే మరో బ్యూటీ నభా నటేష్ పరిస్థితి ఏంటో మరి. ఒకవేళ నిధి ని తీసేస్తే ఉన్న హైప్ లో సగం పోగొట్టుకున్న వారే అవుతారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. అసలే “లైగర్” డిజాస్టర్ లో పూరి అండ్ కో ఉన్నారు. మరి దీనిని కూడా చెడగొడితే ఇక పూరి మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది.