ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఏ ఇండస్ట్రీ నుంచి అయినా కూడా సరైన సినిమా పడితే దానికి పాన్ ఇండియా వైడ్ గా 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు అనేది ఒక కేక్ వాక్ లా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఈ ఏడాదిలో అయితే మొట్ట మొదటిసారిగా 1000 కోట్ల వసూళ్ళని ఓపెన్ చేసిన హీరో షారుఖ్ ఖాన్ కాగా ఆ చిత్రమే “పఠాన్”.
మరి ఈ సినిమా తర్వాత షారుక్ నుంచి వస్తున్నా పవర్ ఫుల్ సినిమానే “జవాన్”. దీనిని తమిళ యంగ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించగా సౌత్ ఇండియా నుంచి గాని బాలీవుడ్ నుంచి కానీ ఇదే ఒక క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ చిత్రం కోసం ఇప్పుడు సెన్సేషనల్ హైప్ నెలకొనగా ఈ సినిమాతో మాత్రం అట్లీ కూడా 1000 కోట్ల మార్కెట్ లోకి వెళ్లబోతున్నాడు అని ట్రేడ్ వర్గాలు గంటాపథంగా చెప్తున్నారు.
మెయిన్ గా నిన్న వచ్చిన ట్రైలర్ తో అయితే అంచనాలు పీక్స్ లోకి వెళ్లిపోయాయి. ఎంతలా అంటే జవాన్ ముందు పఠాన్ సినిమాని హిందీ జనమే తీసి పారేస్తున్నారు. దీనితో ఈ సినిమా వరల్డ్ వైడ్ 1000 కోట్లు వసూళ్లు ఈజీగా క్రాస్ చేస్తుంది అని ఇప్పుడు నుంచే అంటున్నారు.
అయితే ఇప్పటివరకు తమిళ సినిమా దర్శకుల్లో ఏ దర్శకుడు కూడా 1000 కోట్ల సినిమా లేదు ఆఖరికి దర్శకుడు శంకర్ కి కూడా 800 కోట్ల సినిమా మాత్రమే ఉంది. ఇక అట్లీ గాని సక్సెస్ అయితే ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ పవర్ తో 1000 కోట్ల క్లబ్ లోకి తాను చేరిపోతాడు అని చెప్పడంలో సందేహమే లేదు. మరి అట్లీ అయితే తమిళ్ నుంచి మొదటి 1000 కోట్ల దర్శకుడు అవుతాడా లేదా అనేది చూడాలి.