వైరల్ : “యాత్ర 2” కోసం సోనియా గాంధీగా ఈ ఇంగ్లీష్ నటి..!

ప్రస్తుతం ఏపీలో పాలిటిక్స్ అన్నీ కూడా మంచి రసవత్తరంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ క్రమంలో ప్లులువురు రాజకీయ నాయకులు అయితే తమ పొలిటికల్ బూస్టప్ కోసం సినిమాని కూడా గట్టిగానే వాడేస్తున్నారు. అలాగే లాస్ట్ ఎలక్షన్ టైం లో అయితే అటు టీడీపీ మరియు వైసీపీ రెండు పార్టీలకి కూడా అనుకూలంగా పలు చిత్రాలు చేయించి రిలీజ్ చేసుకున్నారు.

మరి అలా వైసీపీ నుంచి వచ్చిన చిత్రమే “యాత్ర”. స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారముగా కొన్ని సీన్స్ పై చేసిన ఈ చిత్రం దీనికి సీక్వెల్ ని అయితే దర్శకుడు మహి వి రాఘవ్ మళ్ళీ ఈ టర్మ్ ఎలక్షన్ టైం లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. అయితే ఈసారి వై ఎస్ జగన్ పాత్రపై కూడా ఎక్కువ ఫోకస్ ఉండనుండగా పార్ట్ 2 కి “యాత్ర 2” అని పెట్టి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

ఇక పార్ట్ 1 మరియు 2 లో కూడా వై ఎస్ పాత్రని నటుడు మమ్ముట్టి చేస్తుండగా ఈసారి వై ఎస్ జగన్ రోల్ లో తమిళ యంగ్ హీరో జీవా నటిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ సినిమా నుంచి వచ్చినది అయితే వైరల్ గా మారింది. ఈ సినిమాలో అలాగే వై ఎస్ జగన్ పొలిటికల్ లైఫ్ లో ముఖ్య పాత్రధారి అయినటువంటి నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్రలో అయితే ఓ ఇంగ్లీష్ నటి కనిపించనున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు లాక్ చేశారు.

అయితే ఆమె జర్మనీ నటి కాగా ఆమె సోనియా గాంధీగా ఈ సినిమాలో ఒప్పుకొని చేయడం విశేషం. దీనితో ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమా నుంచి సినీ వర్గాల్లో అలాగే పొలిటికల్ గా కూడా మంచి వైరల్ గా మారింది. మొత్తానికి అయితే మేకర్స్ చాలా నాచురల్ గా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని కూడా ఓ టాక్ దీనితో స్టార్ట్ అయ్యింది. 
https://x.com/baraju_SuperHit/status/1721751000850272638?s=20