ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషనల్ హైప్ తో కూడుకొని ఉన్న బిగ్గెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ సినిమా “సలార్” కూడా ఒకటి కాగా ఈ సినిమా కోసం అయ్యితే అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో ప్రభాస్ అన్ని సినిమాల్లానే ఈ సినిమా కూడా ఊహించని విధంగా మళ్ళీ అనుకున్న రిలీజ్ డేట్ కి అయితే రావడం కష్టమే అని అర్ధం అయ్యిపోయింది.
కాగా ఈ చిత్రం కొత్త డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఇంతకీ ఎపుడు ఉంటాయి అనేవి మిలియన్ డాలర్ ప్రశ్నలుగా మారగా ఈ సినిమా కొత్త డేట్ పై ఇప్పుడు సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ చోటు చేసుకుంటున్నాయి. ఇలా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ భారీ సినిమా ఈ నవంబర్ లోనే విడుదల కాబోతుంది అని జనవరిలోకి జరగదు అనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
మేకర్స్ ఈ దీపావళి మార్కెట్ ని బాగా టార్గెట్ పెట్టుకున్నారట. అప్పుడు అయితే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ సహా మెయిన్ గా హిందీ మార్కెట్ లో సెన్సేషనల్ వసూళ్లు కొల్లగొట్టచ్చని చూస్తున్నారట. అందుకే దీపావళి తప్ప మరో సమయం లేదు అని అందుకే అప్పటికి ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది.
కాగా నయా అప్డేట్ ప్రకారం అయితే ఈ సినిమాని నవంబర్ పదో తేదీన విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా ఆ సినిమా నిర్మాణ సంస్థే దీనిని కూడా నిర్మాణం వహించింది.