ఇండస్ట్రీ టాక్ : టాలీవుడ్లో అడుగు పెట్టబోతున్న బాలీవుడ్ బడా సంస్థ.!

ఇప్పుడు మన స్టార్ హీరోస్ తెలుగు సహా హిందీ మరియు తమిళ హీరోస్ ని అడిగినా కూడా ఇప్పుడు అంతా ఒకటే సినిమా ఉంది ఇండియన్ సినిమా అని ఇండియన్ సినిమా అంటారు. ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ శాండిల్ వుడ్ లాంటివి లేవని అంతా ఒకటే సినిమా ఇండియన్ సినిమా అని అంటున్నారు.

ఇక ఇదే రకంగా అయితే తెలుగు హీరోలు హిందీలో తమిళ్ దర్శకులతో అలాగే తమిళ హీరో లు తెలుగు దర్శకులతో ఆ దర్శకులు తెలుగు హీరోస్ తో ఇక బాలీవుడ్ నుంచి అయితే వారు కూడా తెలుగు దర్శకులతో వర్క్ చేస్తూ అంతా ఇప్పుడు ఒకటి అయ్యిపోయింది.

కాగా బాలీవుడ్ మార్కెట్ లో అయితే మన తెలుగు నిర్మాతలు కూడా వెళ్లి పలు సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ నుంచి అయితే ఓ బడా నిర్మాణ సంస్థ టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ సంస్థ మరేదో కూడా కాదు ఇప్పుడు “ఆదిపురుష్” రిలీజ్ తో అలాగే బాలీవుడ్ లో ఎన్నెనో భారీ చిత్రాలు చేస్తూ వస్తున్నా ప్రముఖ సంస్థ టి సిరీస్ అట.

కాగా టి సిరీస్ వారు అయితే ఇక నుంచి తెలుగులో కూడా ప్రొడ్యూస్ చేయనున్నారని అలాగే ఆల్రెడీ హైదరాబాద్ లో కొన్ని ఎకరాల స్థలం కూడా కొని అక్కడ తమ ఆఫీస్ కోసం భారీ బిల్డింగ్ ని తమ ఆఫీస్ ని నిర్మించే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. దీనితో రానున్న రోజుల్లో తెలుగు నుంచి కూడా టి సిరీస్ సినిమాలు వస్తాయని చెప్పాలి. ఇక ఈ భారీ సంస్థ నుంచి అయితే ఇప్పుడు ఆదిపురుష్ తర్వాత బ్రహ్మాస్త్ర తదితర ఇతర భారీ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి.