“రాధేశ్యామ్” లో ఇలాంటి సీన్ ఎందుకు తీసేసారు.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పలు భారీ సినిమాల్లో యంగ్ దర్శకుడు రాధా కృష్ణ తో చేరిన భారీ పీరియాడిక్ చిత్రం “రాధే శ్యామ్” కూడా ఒకటి. మరి ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సినిమా రిలీజ్ కి ముందు అయితే దీనిపై ఉన్న హైప్ మరో లెవెల్ అని చెప్పాలి. అప్పటికే ఇది ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని అందరికీ తెలిసిందే.

అంతే కాకుండా ప్రభాస్ నుంచి రొటీన్ కి భిన్నంగా ఒక్క ఫైట్ కూడా సినిమా లో లేకుండా ప్రభాస్ కొత్త ప్రయత్నం చేసాడు. కానీ ఫైనల్ గా మాత్రం గత ఏడాదికి ఈ చిత్రం భారీ నష్టాలు అందుకున్న సినిమాగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా ఎంత లవ్ స్టోరీ అయినప్పటికీ ఎమోషన్స్ పరంగా ఇంకా బెటర్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది.

అవి కూడా పెట్టి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది అని చెప్పాలి. మరి లేటెస్ట్ గా సోషల్ మీడియాలో రాధే శ్యామ్ క్లైమాక్స్ కి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. వీటిలో హీరో పై ఉన్న ఓ బ్యూటిఫుల్ పోస్టర్ చూసి ప్రభాస్ ఫాన్స్ చింతిస్తున్నారు.

మరి ఈ సినిమాలో ప్రేమకి విధికి మధ్య యుద్ధం అని యూనిక్ కాన్సెప్ట్ కనిపిస్తుంది. మరి ఆ క్లైమాక్స్ సునామీలో చిక్కుకున్న ప్రభాస్ అందులోని తనకి చేతిలో లేని ప్రేమ రేఖ ఆ విధిని అధిగమించి ప్రేమని సొంతం చేసుకోవాలని తన అర చేతిని చూస్తూ బాధపడతున్న విక్రమ్ ఆదిత్య పిక్ చూడొచ్చు.

ఇది చూస్తేనే ఎంతో అందంగా ఉంది. ఇలాంటి సాలిడ్ ఎమోషనల్ సీన్ సినిమాలో పెట్టి ఉంటే ఇంకెంత బాగుండేదో మంచి మంచి సీన్స్ ని తీసేశారని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు బాధపడుతున్నారు. మరి వీటితో పాటుగా మరికొన్ని పోస్టర్ లు కూడా బయటకొచ్చి ఇప్పుడు వైరల్ గా మారాయి.