Sameer: అందరి ముందు వాళ్లు నన్ను చాలా అవమానించారు… జీవితంలో మర్చిపోలేని అవమానం: నటుడు సమీర్

Sameer: శుభ సంకల్పం సినిమా వంద రోజుల వేడుకకు ఎన్టీ రామారావు గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారని, వైజాగ్‌లో ఉన్న తన ఇంటికి కాల్ చేసి, తాను అది తెలుసుకొని లాస్ట్ మినిట్‌లో రవీంద్ర భారతికి వెళ్లానని నటుడు సమీర్ చెప్పారు. అప్పుడు తనకు వెహికిల్ కూడా లేదన్న ఆయన, రవీంద్ర భారతిని చూడడం కూడా అదే ఫస్ట్ టైం అని ఆయన అన్నారు. తాను వెళ్లడానికి గేటు దగ్గర ఉండే సెక్యూరిటీ లోపలికి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వలేదని, తన దగ్గర ఇన్విటేషన్‌కి సంబంధించిన ఎలాంటి ఆధారమూ లేదని ఆయన చెప్పారు. తాను ఏం చెప్పినా వాళ్లు నమ్మలేదని, ఎలాగోలా బతిమిలాడుకొని ఆ గేటు దాటిన తర్వాత ఇంకో ఎంట్రేన్స్ గేటు ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

అక్కడ కూడా వాళ్లు తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని, లోపల షీల్డ్స్ ఇస్తున్నారని, అందులో తన పేరు కూడా వచ్చిందని, అది విని ఇప్పుడు పిలిచిన పేరు తనదేనని చెప్పినా కూడా వాళ్లు తనను వెళ్లనివ్వలేదని ఆయన వాపోయారు. ఇక చేసేదేం లేక పార్కింగ్‌ దగ్గరే ఉండిపోయానని, వాళ్లందరూ వెళ్లిపోయాక ప్రొడక్షన్‌ వాళ్లు కలిసి నన్ను రాలేదేంటీ అని అడగడంతో జరిగిందంతా చెప్పానని సమీర్ తెలిపారు. సరే అయిపోయేందేదో అయిపోయింది కదా తాజ్ కృష్ణలో డిన్నర్ ఏర్పాటు చేశారు.. అక్కడ ప్రెస్‌ మీట్ కూడా ఉందని, బాలు గారు వస్తున్నారని చెప్పడంతో తాను కూడా బయలు దేరానని ఆయన చెప్పారు. ఎవరి కార్లలో వాళ్లు వెళ్లిపోయారన్న ఆయన, తాను ఒక ఆటోలో అక్కడికి వెళ్లానని చెప్పారు.

అక్కడికి వెళ్లాక ఎలాగోలా బాలు గారి దగ్గరికి వెళ్లానని, జరిగిందంతా చెప్పేసరికి, నీ షీల్డ్ ఉంది తీసుకో అడిగి అని చెప్పారని సమీర్ అన్నారు. కానీ ఆ షీల్డ్ కోసం ఎంత తిరిగానో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆ షీల్డ్ తనకు దక్కలేదని ఆయన చెప్పారు. దీని తర్వాత ఇంద్ర సినిమా 175రోజుల వేడుక సమయంలో కూడా ఓ షీల్డ్ తీసుకున్నానని, అవి ఎవరింటికి వారికి పంపిస్తామని చెప్పడంతో అక్కడి నుంచి వచ్చేశానని ఆయన చెప్పారు. కానీ ఆ తర్వాత ఎంత మందిని అడిగినా తాను తీసుకోలేకపోయానని, ఇప్పటికీ చిరంజీవి గారితో ఆ షీల్డ్ తనకు రాలేదని చెప్తూ ఉంటానని ఆయన నవ్వుతూ అన్నారు.