Suma: తాను ఎవరినీ తొక్కేయలేదు.. ఎవరి టాలెంట్ వాళ్లదే: సుమ కనకాల

Suma: బుల్లి తెర ప్రముఖ యాంకర్ సుమ ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.ఇలా బుల్లితెరపై అన్ని కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా సినిమా ఈవెంట్లు, ఫ్రీ రిలీజ్ వేడుకలు వచ్చాయంటే తప్పనిసరిగా సుమ అక్కడ మనకు దర్శనమిస్తుంది. ఇలా వరుస కార్యక్రమాలు, ఈవెంట్ లతో ఎంతో బిజీగా ఉన్న సుమా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీరు ఇతర యాంకర్ల పొట్ట కొడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు సుమ దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. తాను మరొకరి పొట్ట కొట్టలేదని, ఎవరిని తొక్కేయలేదు అంటూ సూటిగా సమాధానం చెప్పారు. నేను నాకు వచ్చే ఈవెంట్లను తగ్గించుకుంటూ పోతే నా EMI మీరు కడతారా? నా పిల్లల ఫీజులు మీరు కడతారా? అలాంటప్పుడు నా కష్టం ఏదో నేను పడాలి కదా అంటూ సుమ దిమ్మతిరిగే సమాధానం చెప్పారు.

ఇండస్ట్రీలో ఉన్న యాంకర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ ఎవరి టాలెంట్ వాళ్లకు ఉంటుంది. ఎవరికి రావాల్సిన అవకాశాలు వారికి వస్తుంటాయి, ఎవరి స్టైల్ వాళ్లకి ఉంటుంది. వారందరి స్టైల్ నేను అభిమానిస్తూ ఉంటాను అంటూ సుమ ఘాటుగా తన గురించి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు. ఇక సుమ బుల్లితెరపై వ్యాఖ్యాతగా ప్రేక్షకులను సందడి చేశారు.అయితే వెండితెరపై జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా ఎలా ప్రేక్షకులను సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.