ఈరోజు “ఆదిపురుష్” భారీ ఈవెంట్ హైలైట్స్ ఇవే.!

మళ్ళీ చాలా కాలం తర్వాత అయితే కంప్లీట్ గా పాన్ ఇండియా సినిమాని షేక్ చేసే సినిమాగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్”. మరి ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు తిరుపతి లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటూ ఉండగా ఆల్రెడీ భారీ ఎత్తున ప్లానింగ్స్ జరుగుతున్నాయి.

ఇక ఈరోజు ప్రభాస్ కూడా తిరుమల చేరుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాడు. మరి ఇదిలా ఉండగా ఈ గ్రాండ్ ఈవెంట్ పై అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు తెలుస్తున్నాయి. కాగా ఈ ఈవెంట్ లో అయితే ప్రేక్షకులు స్టన్ అయ్యే అంశాలు ఎన్నో ఉండగా కొన్ని క్రేజీ హైలైట్స్ కోసం తెలుస్తుంది.

మొదటగా అయితే బాణా సంచా తో అయితే జై శ్రీరామ్ అనే పదం, శబ్దం వచ్చేలా ఇంట్రెస్టింగ్ ప్లాన్ టెస్ట్ చేస్తుండగా మరో హైలైట్ గా అయితే ప్రభాస్ ది వర్చువల్ కటౌట్ ని ఏకంగా 50 అడుగులు వచ్చేది ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా ఇది కేవలం లైట్స్ తోనే కనిపిస్తుంది అని అంటున్నారు. ఇవే కాకుండా అయోధ్యపై వేసిన భారీ సెట్ మరో హైలైట్ గా కనిపించనుందట. 

ఇక ఈ ఈవెంట్ కి అయితే చినజియార్ స్వామి ప్రత్యేక అతిధిగా రానుండగా జాతీయ స్థాయి ప్రముఖులు కూడా హాజరు అయ్యే ఛాన్స్ ఉందని ఇప్పుడు తెలుస్తుంది. అలాగే సంగీత దర్శకులు అజయ్ మరియు అతుల్ లు ఈ సినిమా హిట్ సాంగ్ జై శ్రీరామ్ ని లైవ్ పెర్ఫామెన్స్ కూడా చేయనున్నారు. దీనితో అయితే ఈ ఈవెంట్ లో ఇవే మెయిన్ హైలైట్స్ అని తెలుస్తుంది.