బాలీవుడ్ సినిమా దగ్గర మంచి క్రేజ్ సహా మార్కెట్ కూడా ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో దీపికా పదుకొనె కూడా ఒకరు. అయితే దీపికా పదుకొనె ఒక టైం లో వరుస ప్లాప్ లు అందుకున్నప్పటికీ ఇపుడు వరుస హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి సెన్సేషనల్ ప్రాజెక్ట్ లని అయితే అందుకుంటుంది.
మరి ఇదిలా ఉండగా రీసెంట్ గా ఆమె హాజరైన ఓ ఓటిటి షోలో చేసిన హాట్ కామెంట్స్ కూడా నేషనల్ వైడ్ గా వైరల్ గా కూడా మారాయి. మరి ఇదిలా ఉండగా దీపికా ఇప్పటికే బాలీవుడ్ లో ఆల్ మోస్ట్ అందరి బిగ్ స్టార్స్ తో నటించగా వారిలో మాత్రం కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
అయితే బాలీవుడ్ వర్గాలు నుంచి కొన్ని షాకింగ్ గాసిప్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీపికాతో ఇక సినిమాలు చేయడం మానుకోవాలని ఇద్దరు స్టార్ హీరోస్ భార్యలు వారికి చెప్పినట్టుగా ఓ టాక్ బి టౌన్ లో మొదలైంది. మరి ఆ హీరోస్ లో ఒకరు ఆల్రెడీ షారుఖ్ ఖాన్ కాగా మరో హీరో అయితే రణబీర్ కపూర్ అన్నట్టు తెలుస్తుంది.
షారుఖ్ ఖాన్ భార్య గౌరి ఖాన్ రీసెంట్ గా “జవాన్” సినిమాకి నిర్మాణం వహించారు. అలాగే ఆ సినిమాలో కూడా దీపికా నటించింది. అయితే ఆమె ఇక నుంచి దీపికా తో సినిమాలు వద్దని షారుఖ్ తో చెప్పినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే రణబీర్ భార్య నటి ఆలియా భట్ కూడా రణబీర్ కి ఇదే మాట చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు అంత బలమైన కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.