నేషనల్ లెవెల్ లో బ్రాండ్ అంబాసిడర్లుగా హవా కొనసాగిస్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే?

ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు ఇటు సౌత్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇంతకాలం బాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం సౌత్ ఇండస్ట్రీ హీరో హీరోయిన్లు ఎదురు చూసేవారు. ప్రస్తుతం పరిస్థితి మొత్తం తారుమారయ్యింది. ఒకప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయటానికి నిరాకరించిన బాలీవుడ్ హీరోలు ఇప్పుడు పని కట్టుకొని మరి వారితో సినిమాలో చేయటానికి వస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల ఎఫెక్ట్ బాలీవుడ్ మీద బాగా పడింది.

బాలీవుడ్ లో చాలా కాలంగా ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. కానీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల టాలివుడ్ సినిమాలు బాలీవుడ్ లో మంచి ఆదరణ పొందాయి. ఇంతకాలం సౌత్ ఇండస్ట్రీకే పరిమితమైన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించిన పుష్ప పాత్ర ప్రేక్షకులను కూడ బాగా ఆకట్టుకుంది. దీంతో అల్లు అర్జున్ సినిమా రేంజ్ మాత్రమే కాకుండా అల్లు అర్జున్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. దీంతో అల్లు అర్జున్ ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు బ్రాండ్స్‌ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నాయి.

ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. కానీ బన్నీ మాత్రం వరుస యాడ్స్ లో నటిస్తూ ప్రేక్షకులకు టచ్ లో ఉంటున్నాడు.ప్రస్తుతం బన్నీ సినిమా షూటింగ్ లేకపోయినా కూడా వరుస యాడ్స్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా మరోక టాలివుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకి నేషనల్ వైడ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ హీరోలకు పోటీగా యాడ్స్ లో నటిస్తున్నాడు. విజయ్ ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా సినిమాలో కూడ నటించలేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్ని రోజులలో లైగర్ సినిమా ద్వారా విజయ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.