కోట్లు విలువ చేసే సొంతిల్లు ఉన్నా కూడా అద్దె ఇంట్లో ఉంటున్న స్టార్ హీరోలు వీళ్లే…?

సాధారణ ప్రతిఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. ఎంత పేదరికంలో ఉన్నవారైనా కూడా సొంత ఇంటిని నిర్మించుకోవడం కోసం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు. ఇక డబ్బున్న వారు కోట్లు ఖర్చు చేసి మరి ఇంద్ర భవనాలు లాంటి ఇల్లు నిర్మించుకుంటారు. సెలబ్రిటీల ఇల్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కొక్కరు కోట్ల రూపాయలు వెచ్చించి వారికి నచ్చినట్లుగా అన్ని సౌకర్యాలు ఉండేలా విశాలమైన ఇళ్లను నిర్మించుకుంటారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు ఇష్టంగా నిర్మించుకున్న ఇళ్ళను వదిలేసి అద్దె ఇంట్లో ఉంటున్నారు.

ఇంద్ర భవనాలు ఆంటీ ఇళ్లను వదిలి అదే ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ సెలబ్రిటీలెవరో చూసేయండి..

మహేష్ బాబు : టాలీవూడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్ప్కర్లేదు. వరుస సినిమాలు చేస్తూ బాగా సంపాదించిన మహేష్ బాబుకి జూబ్లీహిల్స్ లో ఖరీదైన ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉంది. కానీ మహేష్ బాబు ఆ ఇంటిని వదిలి త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకొని అందులో ఉంటున్నాడు.

పవన్ కళ్యాణ్ : మెగా హీరో పవన్ కళ్యాణ్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. పవన్ కళ్యాణ్ కి నందగిరిలో ఒక పెద్ద ఇల్లు ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ ఇంటిని వదిలి అతని ఫామ్ హౌస్ లో చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

జగపతి బాబు : ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందిన జగపతిబాబు ఎప్పుడు విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలు చేస్తూ బిజీగా అంటున్నాడు. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ దగ్గర జగపతిబాబుకి ఖరీదైన ఇల్లు ఉంది. కానీ జగపతిబాబు ప్రస్తుతం కూకట్ పల్లి లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడని సమాచారం.

నాగచైతన్య: నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా సొంత ఇంటిని వదిలి అబిడ్స్ మాల్ కి దగ్గరలో ఉన్న ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే చైతన్య ఇంట్లో ఉండటానికి కారణం అతని తల్లి లక్ష్మి ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేయటం .

రాజమౌళి : దేశంలో నెంబర్ వన్ దర్శకుడుగా గుర్తింపు పొందిన రాజమౌళి గతంలో ఒక ఖరీదైన విల్లా లో నివాసం ఉండేవాడు. కానీ ప్రస్తుతం మణికొండ లో ఉన్నా ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో అద్దెకు ఉంటున్నట్లు సమాచారం.