Big Boss OTT: ఈవారం నామినేషన్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్ లు వీళ్లే?

Big Boss OTT: బిగ్ బాస్ రియాలిటీ షో పలు భాషలలో మంచి ప్రేక్షకాదరణ పొందడం వల్ల తెలుగులో కూడా దీనిని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రసారమైన అన్ని సీజన్లు బుల్లితెర మీద ప్రసారమయ్యాయి. కానీ ప్రస్తుతం అన్ని భాషలలో బిగ్ బాస్ రియాలిటీ షో లోని ఓటిటి లో ప్రసారం చేస్తున్నారు. అందువల్ల కొంత కాలం క్రితం తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ఓటిటిలో ప్రారంభించారు.తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటివరకు 5 సీజన్ లను పూర్తి చేసుకుంది. మునుపటి సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ లో మిశ్రమ ఫలితం అందుకుంటోంది.

బిగ్ బాస్ ఎలిమినేషన్ రోజు కంటెస్టెంట్ లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆదివారం రోజు నాగార్జున కంటెస్టెంట్ లకు ఫన్నీ టాస్క్ లు ఇస్తాడు. వారం రోజుల పాటు ఒకరికొకరు కలిసి మెలిసి ఉన్న కంటెస్టెంట్ లు నామినేషన్ ప్రక్రియ మొదలవగానే ఒకరిమీద ఒకరు మాటలతో విరుచుకుపడతారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. పోయిన వారం మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. మహేష్ వెళ్తూ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.

అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బిందుమాధవి, ఆశు రెడ్డి, అఖిల్, అజయ్, అనిల్, హమీదా నామినేషన్ లో ఉన్నారు. వచ్చేవారం వీరందరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో అని ప్రేక్షకులలో టెన్షన్ మొదలైంది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సి ఉంటుంది.