సినిమా ఇండస్ట్రీలో సిల్క్ స్మిత ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో ఈమె సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇక ఈమెను చూడటం కోసమే సినిమాకు వెళ్లేవారు అని చెప్పడంలో కూడ ఏ మాత్రం సంకోచం వ్యక్తం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో తన మత్తు కళ్ళతో అందచందాలతో కుర్రకారులను ఆకట్టుకున్నటువంటి ఈమె ఎన్నో వందల సినిమాలలో నటించి మెప్పించారు. ఇలా ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఏలిందని చెప్పాలి.
ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఈమె ఎంత త్వరగా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అంతే త్వరగా ఈ లోకం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.ఈమె తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించిందని అందరికీ తెలిసిన విషయమే అయితే ఓ హీరో కారణంగానే ఈమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని వార్తలు వినిపించాయి. తాజాగా ఈమెతోపాటు నటిగా కొనసాగినటువంటి అనురాధ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చివరి మాటల గురించి గుర్తు చేసుకున్నారు.
సిల్క్ స్మిత రేపు చనిపోతుందనే ముందు రోజు రాత్రి తనకు ఫోన్ చేసి అర్జెంటుగా తన వద్దకు రమ్మని పిలిచింది అయితే ఆ సమయంలో తన భర్త బెంగుళూరు నుంచి వస్తున్నారని రేపు ఉదయం పిల్లలను స్కూల్ దగ్గర దింపి సరాసరి వస్తానని చెప్పాను. అవునా సరే అంటూ ఫోన్ పెట్టేసింది.అయితే ఉదయం లేవగానే టీవీలలో సిల్క్ స్మిత చనిపోయారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని హుటాహుటిన తాను ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ తనని ఒక స్ట్రక్చర్ పై పడుకోబెట్టి ఉన్నారని తన డెడ్ బాడీ పై ఈగలు వాలడం చూసి ఒక్కసారిగా నాకు దుఃఖం ఆగలేదని సిల్క్ స్మిత మరణం గురించి అనురాధ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.