ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ ఇవేనా?

కొన్ని సినిమాలు భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఊహించని స్థాయిలో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాలుగా మారుతాయి. కథ డిమాండ్ చేసింది అంటూ దర్శకులు నిర్మాతలతో ఆయా చిత్రాల కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తారు. ఫైనల్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక అసలు పెట్టిన పెట్టుబడిలో 10వ శాతం కూడా రాబట్టని మూవీస్ ఉన్నాయి.

స్ట్రాంగ్ బ్యాక్ అప్ ఉన్న నిర్మాతలు అయితే ఇలాంటి డిజాస్టర్స్ ని తట్టుకొని నిలబడగలరు. లేదంటే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోవాల్సింది. ఈ ఏడాది టాలీవుడ్ లో అలాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలు పడ్డాయి. అందులో మొదటి మూవీ ఏజెంట్. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సురేందర్ తో పాటు అనిల్ సుంకర నిర్మాతలుగా ఉన్నారు.

ఇద్దరు కలిసి మూవీపై 80 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథని చెప్పడంతో అందుకు తగ్గ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ ఖర్చు చేశారు. అయితే రిలీజ్ తర్వాత సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో రెండో రోజే థియేటర్స్ మేగ్జిమమ్ ఖాళీ అయిపోయాయి. ఈ చిత్రం ఓవరాల్ గా 6.5 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టి అటు డిస్టిబ్యూటర్స్, ఇటు నిర్మాతని కోలుకోలేని స్థాయిలో దెబ్బ తీసింది.

నాన్ థీయాట్రికల్ బిజినెస్ తో కలుపుకున్న ఏజెంట్ సినిమా అనిల్ సుంకరని ఏ విధంగా సేవ్ చేయలేకపోయింది. రెండో మూవీ గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన రామబాణం. గోపీచంద్ కెరియర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా ఇది తెరకెక్కింది. ఏకంగా 50 కోట్ల వరకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పెట్టుబడి పెట్టింది. ఓవరాల్ గా ఈ మూవీ కేవలం మూడు కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది.

గోపీచంద్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా రామబాణం ఇప్పుడు మారిపోయింది. నిర్మాతలకి దారుణంగా నష్టాలు మిగిల్చింది. ఈ ఏడాది ఆరంభంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏజెంట్, రామబాణం సినిమాలతో రెండు పెద్ద షాక్ లు తగిలాయని చెప్పాలి. వీటిని చూసిన తర్వాత అయిన దర్శకులు తమ ఆలోచనలు మార్చుకొని కంటెంట్ బేస్డ్ కథలపై దృష్టి పెడితే బెటర్ అనే మాట వినిపిస్తోంది.