ఈ నెల 20వ తేదీ ఆదివారం నాడు బిగ్‌బాస్ 4 సీజన్ కి శుభం కార్డు పడనుంది.మరి ఫైనల్ ఎపిసోడ్ లో ఓ రేంజ్ ఎంటర్ టైన్మెంట్ ఉంటేనే కదా షో హిట్ అయినట్టు. లేకపోతే బిగ్ బాస్ కు డామేజ్ వస్తుంది. అందుకే చివరి రోజు గ్రాండ్ ఫినాలెకి మూడు రోజులు ముందుగానే హౌస్ లోకి కొత్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా ఈ నెల 17 న మళ్లీ బయటకు వచ్చిన టీమ్ మేట్స్ అందరినీ లోపలకు పంపించే ఆలోచనలో ఉన్నారట నిర్వాహకులు. ఈ సారి ఫైనల్ లో ఈ కొత్త ఎలిమెంట్ తో ప్రేక్షకులకి జోష్ ఇవ్వాలని చూస్తున్నారట. కానీ కరోనా నెపథ్యంలో బయట నుండి కొత్తవాళ్లను హౌస్ లోకి పంపాలి అంటే.. మళ్లీ పరిక్షలు ఇతరత్రా వ్యవహారాలు అన్నీ వుంటాయి.. ఉండాలి కూడా.మరి చూస్తుంటే ఇదంతా అయ్యే పని కాదనిపిస్తుంది.
అలా కుదరకపోతే… యంగ్ హీరోయిన్ల అందాలతో హాట్ డోస్ పెంచేయాలని ప్లాన్ చేసిందట బిగ్ బాస్ మేనేజ్‌మెంట్. ఇందుకోసం నివేదా పేతురాజ్, మెహ్రీన్, లక్ష్మీరాయ్ గ్లామరస్ బ్యూటీలను రంగంలోకి దించుతున్నారని సమాచారం. వీరితో స్పెషల్ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ ఇప్పిస్తూ రచ్చ రచ్చ చేయనున్నారట బిగ్ బాస్.ఇక ఫైనల్ ఎపిసోడ్ లో విన్నర్ కి ఒక స్పెషల్ గెస్ట్‌తో ప్రైజ్ మనీని అందివ్వటం జరుగుతుంది. ఈ ఫైనల్ కి స్పెషల్ గెస్ట్ గా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గానీ,జూనియర్ ఎన్టీఆర్ గానీ, లేదా మరోసారి మెగాస్టార్ చిరంజీవి గానీ రాబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. సో.. చూడాలి మరి బిగ్ బాస్ ఫైనల్ ని ఎలా సెట్ చేశారో. మొత్తానికి బిగ్ బాస్ చివర్లో మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాడు. అనుకున్నట్లుగానే గ్రాండ్ ఫినాలె నాడు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ బాగా వర్కౌట్ అయితే.. ఇక టీఆర్పీ రేటింగ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ.