ఇక అదుర్స్ సీక్వెల్ లేనట్టేనా… క్లారిటీ ఇచ్చిన వివి వినాయక్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో వివి వినాయక్ ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వివి వినాయక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు

ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో వివి వినాయక్ దర్శకత్వంలో నటించిన చిత్రం అదుర్స్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం ఉంటుందని వినాయక్ వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కి రెండు కథలు చెప్పగా ఎన్టీఆర్ ఈ రెండింటిని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.అయితే తాజాగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా మరోసారి ఈ సినిమా సీక్వెల్ గురించి వినాయక్ ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. అదుర్స్ సీక్వెల్ లేనట్టే అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు . ఇప్పటికే రెండు మూడు కథలను సెలెక్ట్ చేసిన ఈ కథలు పెద్దగా నచ్చకపోవడంతో ఈ సినిమా సీక్వెల్ కి పుల్ స్టాప్ పడిందని తెలిపారు.అదుర్స్ సినిమా ఎన్టీఆర్ కెరియర్ కు నా కెరియర్ కు ఓ మంచి సినిమా ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని ఇకపై టచ్ చేయకూడదని భావించాము అందుకే ఈ సినిమాకి సీక్వెల్ ఉండదంటూ ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.