ఇకపై అభిమానులను నిరాశ పరిచే ప్రసక్తే లేదు.. వెంకీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం హైదరాబాదులో
‘ఎఫ్‌3 ఫన్‌టాస్టిక్‌’ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్ర కథానాయకుడు వెంకటేష్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నటించిన గత రెండు సినిమాలు కూడా థియేటర్లో కాకుండా ఓటీటీ లో విడుదలయ్యాయి. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమాలను థియేటర్లలో విడుదల చేయలేకపోయాము. నా సినిమాలు థియేటర్లో విడుదల అవుతాయని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురయింది. ఇకపై అభిమానులను నిరాశ పరిచే ప్రసక్తే లేదని తన సినిమాలను కూడా థియేటర్లోనే విడుదలవుతాయని వెంకటేష్ వెల్లడించారు.

నా సినిమాను థియేటర్లు చూడాలని ఎదురుచూసే అభిమానులకు ఎఫ్3 సినిమా ఫుల్ ఫన్ ట్రీట్ ఇస్తుందని,నన్ను ఎంతగానో అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని వెంకటేష్ వెల్లడించారు. అనిల్ అద్భుతమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరిని సందడి చేస్తోందని, ఈ సినిమాని మే 27న థియేటర్ లో చూసి ఆనందించండి అంటూ వెంకటేష్ తెలియజేశారు.