Rashmika: మరో జన్మంటూ ఉంటే అబ్బాయిగా పుడుతాను….షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక!

Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో అతితక్కువ సమయంలోనే హీరోయిన్ గా ఎంతో గుర్తింపు పొందిన నటి రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.పుష్ప సినిమాతో ఇంత మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ తాజాగా నేడు ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాని విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రష్మీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.రష్మిక ఇంత చిన్న వయసులోనే ఎంతో మంచి
పేరు, గుర్తింపు సంపాదించుకున్న ఈమె వచ్చే జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. వచ్చే జన్మంటూ ఉంటే అబ్బాయిగా పుట్టాలని తాను కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేసిన తర్వాత ఒక అమ్మాయిగా ఈ డ్రస్సులు వేసుకోవడం చాలా కష్టంగా అనిపించింది అందుకే మళ్ళీ జన్మంటూ ఉంటే అబ్బాయిగా పుట్టాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. చాలా కాలం తర్వాత ఫ్యామిలీ సినిమా చేశాం. థియేటర్‌కు వచ్చి చూడండి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. అంటూ రష్మిక ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.