Suresh Babu: ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలా లోపాలున్నాయి.. చెప్పినా ఎవరూ వినరు: నిర్మాత సురేష్ బాబు

Suresh Babu: తాను ఇండస్ట్రీలో చాలా మార్పులు తేవాలని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సినీ నిర్మాత సురేశ్ బాబు అన్నారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో చాలా లోపాలన్నాయని, అవి సరిచేయాలనేదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. మనమెందుకు ప్రపంచంలో నంబర్ వన్ ఇండస్ట్రీగా మారకూడదు అని ఆయన ప్రశ్నించారు. ప్రాసెసెస్, సిస్టమ్స్ మారిస్తే అది కచ్చితంగా జరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు. అలా చేస్తే ఆ లోపాలను సరిచేసే అవకాశాలు చాలా ఉంటాయని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆ లోపాలను మార్చాలని చాలా ఉంటుంది గానీ అవెలా చేయాలో మనకు తెలియదు కదా అని ఆయన చెప్పారు.

కౌన్సిల్‌లో జరుగుతున్న వర్గ విభేదాలపై సురేశ్ బాబు స్పందించారు. ఇంతకుముందు పెద్దరికంతో నడిచిపోయేదని, ఇదే కాదు ఇండియన్ అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ చూసినా కూడా ఇంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో మెయింటైన్ అయినట్టు ఇప్పుడు అవుతుందా అని ఓ ఉదాహరణకు చెప్పారు. ప్రతీ ఒక్కరికీ తామేం అనుకుంటున్నారో చెప్పే హక్కు ఉంటుందని, కానీ వాళ్లు చెప్పే విధానం తప్పుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆ విషయంలో ఎవరేం చెప్పినా వినరని ఆయన అన్నారు.

ఇకపోతే ఇప్పుడంతా ఓటింగ్ పాలిటిక్స్ అయిపోయానని ఆయన చెప్పారు. ఎలక్షన్స్‌కి వెళ్లాలి, నిలబడాలి, చేయాలి అని ఆయన చెప్పుకొచ్చారు. అందుకనే ఒక 21 ప్రొడ్యూసర్స్ కలిసి, ఎప్పుడూ సినిమా తీసేవాళ్లు కలిసి గిల్డ్ అనే కౌన్సిల్‌ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అందులో కేవలం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మాత్రమే ఉంటారని, 3 ఏళ్లలో ఎవరైనా ఒక్క సినిమా తీయకపోతే వాళ్లు ఎలక్షన్స్‌కి నిలబడకూడదని, వాళ్లు మెంబర్‌గా ఉండొచ్చు గానీ, నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని ఆయన అన్నారు. కానీ అది ఎప్పుడూ పాస్ కాలేదని, ఫైనల్‌గా పోస్ట్‌ అనేది ఇంపార్టెంట్ అని ఆయన స్పష్టం చేశారు.