’థీమ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో ఓ వీడియో విడుదల!

ప్రభాస్‌ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ఈ నెల27న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. నటి శోభనతోపాటు పలువురు నృతకారిణిలు మథురలో నృత్య ప్రదర్శన చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్‌ విూడియా వేదికగా షేర్‌ చేసింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ సరసన దీపికా పదుకోనే నటించగా అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ , దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు.