ముల్లుని ముల్లుతోనే తీయాలి : నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు అతని కూతురు నిహారిక గురించి తెలియని వారంటూ ఉండరు. తండ్రి కూతురు ఇద్దరు ఒకరి మీద ఒకరు చూపించే ప్రేమ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే నాగబాబు కి కూతురు నిహారికా అంటే పంచ ప్రాణాలు. అలాగే నిహారికకి కూడా నాగబాబు అంటే అంతే ఇష్టం. వీరిద్దరూ కూడా తండ్రి కూతుర్ల అనుబంధానికి ఆదర్శంగా ఉంటారు. ఇదిలా ఉండగా నాగబాబు ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది.

నాగబాబు చేతికి గాయం అవ్వటం వల్ల కొంతకాలంగా చేతిని కదపకుండా బ్యాండేజ్ వేసుకొని కనిపిస్తున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ కొత్త సినిమా లాంచ్ లో కూడా చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించారు. ఇదిలా ఉండగా నిహారిక చేసే చిలిపిచేసలు అల్లరి పనుల గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నాగబాబుతో కలిసి నిహారిక చేసే అల్లరి పనులు మరి ఎక్కువగా ఉంటాయి. ఇటీవల నాగబాబు చేతికి బ్యాండేజ్ వేసుకొని ఇంట్లో కూర్చుంటే నిహారిక దగ్గరకు వచ్చి చేయి నొప్పిగా ఉందా డాడీ అని అడిగి క్షణాలలో మీ చేయి నొప్పిని మాయం చేస్తాను అని చెబుతుంది.

పెద్ద పెద్ద డాక్టర్లకే సాధ్యం కాలేదు నువ్వు ఏమైనా మంత్రం వేస్తావా అని నాగబాబు అనగా నిహారిక నాగబాబు మరొక చెయ్యిని పట్టుకొని గట్టిగా కొరికేస్తుంది. దీంతో నాగబాబు గట్టిగా అరవగానే చూశారా మీ చెయ్యి నొప్పి తగ్గిపోయింది అని అంటుంది. ఈ మొత్తం సంఘటనని నాగబాబు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి డాక్టర్ గా మారిన యాక్టర్ నిహారిక అంటూ చెప్పుకొచ్చాడు. ముళ్ళని ముల్లుతోనే తీయడం అంటే ఇదేనేమో, ఇది డాక్టర్ నిహారిక పర్యవేక్షణలో జరిగింది. దయచేసి మీ ఇంట్లో మాత్రం ఇలా చేయొద్దు అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.