తెలుగులో విడుదలవ్వబోతున్న మరో తమిళ బ్లాక్ బస్టర్.. డిసెంబర్ 13న విడుదల!

ఫీల్ గుడ్ మూవీలకి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్దపీట వేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళంలో విజయాలు సాధించిన సినిమాలు ఎక్కువగా తెలుగులో కూడా విజయం సాధిస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే బాటలో తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమా తెలుగులో కూడా విడుదల కి సిద్ధమవుతుంది ఆ సినిమాయే తమిళ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ డా.. డా. ఈ మూవీని తెలుగులో పా..పా టైటిల్ తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు.

గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు తెరపైకి ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతుంది. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రలుగా డైరెక్టర్ గణేష్ బాబు ఎక్కించిన డా..డా చిత్రం తమిళ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. తండ్రి కొడుకుల సెంటిమెంటుతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలుగులో కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు నిర్మాత నీరజ కోట.

అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్ల వసూలు సాధించి ఊహించని విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాని డిసెంబర్ 13న ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా వంటి నగరాల్లో కూడా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎం జి ఎం సంస్థ నుంచి అచ్చిబాబు ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి జెన్ మార్టిన్ సంగీతం అందిస్తున్నారు,

రవి వర్మ ఆకుల సాహిత్యం వహిస్తుండగా కడలే రాంబాబు, అశోక్ దయ్యాల వీఆర్వోలుగా పనిచేస్తున్నారు. కవిన్ అపర్ణ దాస్ తో పాటు ఈ సినిమాలో మౌనిక చిన్ని కోట్ల, ఐశ్వర్య భాగ్యరాజ్ మరియు వీటీవీ గణేష్ ముఖ్యపాత్రలో నటించారు. కే గణేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎస్ అంబేద్కర్ సమర్పణలో తమిళంలో బ్లాక్ బస్టర్ మూవీ గా రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇక తెలుగులో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి