సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో కమెడియన్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు తమ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇలాంటి వారిలో కమెడియన్ సుత్తివేలు ఒకరు.ఈయన ఈ తరం వారికి తెలియకపోయినా నిన్నటి తరం వారికి ఎంతో సుపరిచితమే. ఈయన ఎన్నో సినిమాలలో కమెడియన్ గా, అలాగే ఎన్నో కీలక పాత్రలలో నటించి పెద్ద ఎత్తున సందడి చేశారు.
చిత్ర పరిశ్రమ మద్రాస్ లో ఉన్న సమయంలో ఈయన వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఎప్పుడైతే చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కి వచ్చిందో ఈయనకు కూడా కష్టకాలం మొదలైంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో తన గురువుగా భావించే వీరభద్ర రావు మరణించడంతో ఎంతో కృంగిపోయారు.ఇక ఈయన నటించిన నాలుగు స్తంభాలాట ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు తనకు ఈ అవకాశం కల్పించిన జంధ్యాల మృతి కూడా సుత్తివేలును తీవ్రంగా కృంగదీసింది.
ఈ విధంగా తన గురువులుగా భావించేవారు మృతి చెందడంతో ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి కుటుంబ పోషణ కూడా భారమైంది.ఇలా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కుటుంబ పోషణ కోసం ఈయన ఏకంగా టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడటం కోసం సుత్తి వేలు సీరియల్స్ లో నటిస్తూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరికి 2012వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో తుది శ్వాస విడిచారు.