ఈ టీవీకి దూరమౌతున్న సుడిగాలి సుదీర్.. పూర్తి స్థాయి యాంకర్ గా స్టార్ మాలో సందడి!

సుడిగాలి సుదీర్ బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఎక్కడో మిమిక్రీ ఆర్టిస్ట్ గా బతుకు బండిని లాగుతున్న సుడిగాలి సుదీర్ జబర్దస్త్ ఒక మంచి అవకాశాన్ని కల్పించింది.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అంచలంచలుగా ఎదుగుతూ అతి తక్కువ సమయంలోనే బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా, వెండితెర అవకాశాలను అందుకుని హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా సుడిగాలి సుధీర్ ఎదుగుదలకు ఈ టీవీ మల్లెమాల వారు ఎంతగానో ప్రోత్సహించారని చెప్పాలి.

ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి సుధీర్ ఢీ కార్యక్రమానికి దూరమయ్యారు. అదేవిధంగా ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో కూడా ఈ వారం కనిపించలేదు. ఈ విధంగా సుడిగాలి సుధీర్ క్రమంగా ఈ టీవీకి దూరమవుతున్నారని అభిమానులు భావిస్తున్నారు.

సినిమా అవకాశాల కారణంగా సుడిగాలి సుదీర్ ఈ టీవీ కి దూరమవుతున్నారు అనుకుంటే ఈయన స్టార్ మా లో మరొక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అందుకే ఈయన ఈటీవీకి పూర్తిగా దూరమవుతున్నారా అనే సందేహాలు అభిమానులలో నెలకొన్నాయి.ఈ క్రమంలోనే యాంకర్ అనసూయతో కలిసి పూర్తి స్థాయి యాంకర్ గా స్టార్ మాలో ప్రసారం అవుతున్న జూనియర్ సూపర్ సింగర్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. మరి అందరూ సందేహ పడినట్లు సుధీర్ నిజంగానే ఈటీవీకి దూరం కానున్నారా లేకపోతే అందరి మాదిరిగానే అన్ని చానల్స్ లో యాంకర్ గా వ్యవహరిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.