Pushpha Movie: హిందీ వర్షన్ లో సరికొత్త రికార్డు అందుకున్న శ్రీవల్లి సాంగ్ ఏకంగా గ్లోబల్ టాప్ నెం1 గా ట్రెండ్!

Pushpha Movie: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ సినిమాకి సౌత్ లో కన్నా నార్త్ లో మంచి ఆదరణ లభించిందని చెప్పాలి. ఈ సినిమాకి నార్త్ ప్రేక్షకులు వీరాభిమానులుగా మారిపోయారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్, డైలాగ్స్, పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్, పాటలకు ఎంతోమంది అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకూ రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గత ఏడాది విడుదలైనప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్, శ్రీవల్లి పాట కూడా బాగా హిట్ అయ్యాయి. ఇప్పటికే యూట్యూబ్లో ఈ పాటలు సరికొత్త రికార్డులను సృష్టించగా తాజాగా శ్రీవల్లి పాట మరొక అరుదైన రికార్డును కైవసం చేసుకుంది.

ఈ క్రమంలోనే హిందీ వర్షన్ లో విడుదలైన శ్రీవల్లి పాట యూ ట్యూబ్ లో ఏకంగా 400 మిలియన్ వ్యూస్ దక్కించుకుని గ్లోబల్ నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్న వీడియోగా నిలబడింది. ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కి గ్లోబల్ వన్ స్థానంలో నిలబడిన పాటలలో ఇదే తొలిపాటని చెప్పాలి. ఇక ఈ సినిమా లోని ఈ పాట ఇంత మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం అలాగే అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.