Maddock Films: కంటెంట్‌తో 500 కోట్లు.. మాడాక్ ఫిల్మ్స్ సక్సెస్ రహస్యం!

ఇండియన్ సినీ పరిశ్రమలో స్టార్ పవర్ కంటే కంటెంట్ మేజర్ హైలైట్‌గా నిలిచిన ప్రొడక్షన్ హౌస్‌గా మాడాక్ ఫిల్మ్స్ మరోసారి నిరూపించుకుంది. సాధారణంగా హిందీ సినిమాల్లో పెద్దగా స్టార్ క్యాస్టింగ్ లేకుండా భారీ బడ్జెట్ సినిమాలు హిట్టవ్వడం చాలా అరుదు. కానీ మాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఛావా (Chhaava) – స్త్రీ 2 (Stree 2) వరుసగా 500 కోట్ల క్లబ్‌ను చేరుకోవడం ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారి తీసింది. స్టార్ హీరోలు లేకుండానే ఈ ప్రొడక్షన్ హౌస్ వరుసగా భారీ హిట్లు కొడుతుండటంతో బాలీవుడ్ టాప్ బేనర్లలో ఒకటిగా నిలిచింది.

ఇండస్ట్రీలో బాక్సాఫీస్ విజయాల కోసం స్టార్ హీరోల మీద ఎక్కువగా ఆధారపడే ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. కానీ మాడాక్ ఫిల్మ్స్ అధినేత దినేశ్ విజన్ మాత్రం విభిన్నంగా ఆలోచించారు. కథకే ప్రధానం ఇచ్చి, కంటెంట్ బలంగా ఉంటే సినిమాలు హిట్టవుతాయనే నమ్మకంతో ముందుకు వెళ్లారు. దీంతో తమ బ్యానర్‌లో రూపొందిన చిత్రాలు భారీ రీచబిలిటీతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగాయి. ముఖ్యంగా ఛావా వంటి చారిత్రక నేపథ్యంలో సాగే సినిమాకే భారీ కలెక్షన్లు రావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ముఖ్యంగా మాడాక్ ఫిల్మ్స్ విజయవంతమైన ప్రాజెక్టులను కేవలం కథల ఎంపిక ద్వారా సాధించలేదు. మార్కెటింగ్‌లో అద్భుతమైన వ్యూహాలను ఉపయోగించి సినిమాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేలా చేశారు. ప్రమోషన్స్‌లో కొత్త తరహా స్ట్రాటజీలు తీసుకురావడం, టీజర్, ట్రైలర్ లాంచ్‌లో యునీక్ కాన్సెప్ట్‌లను ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడం వంటి పద్ధతులు మాడాక్ ప్రొడక్షన్స్ ప్రత్యేకతగా నిలిచాయి.

తక్కువ బడ్జెట్‌తో సినిమాలను రూపొందించి, అందులో కంటెంట్‌ను ప్రధానంగా ఉంచితే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ మిశ్రమంగా ఉంటుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. కానీ మాడాక్ ఫిల్మ్స్ ఈ అపోహలను తుడిచిపెట్టేసింది. కేవలం కంటెంట్‌కు విలువ ఇచ్చే సినిమా ప్రేమికులు ఎప్పుడూ ఉంటారనే నమ్మకంతో మాడాక్ ముందుకు సాగుతోంది. ఈ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాల్లో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. భారీ స్టార్ పవర్ లేకున్నా, మంచి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాలను మరింత ఎంగేజింగ్‌గా మార్చగలిగారు.

ప్రస్తుతం మాడాక్ ఫిల్మ్స్ వారి తదుపరి ప్రాజెక్ట్‌లపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా థామా (Thama) , శక్తి శాలిని (Shakti Shalini) సినిమాలు ఈ బ్యానర్ నుంచి రాబోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన విజయం మాదిరిగానే ఈ చిత్రాలు కూడా ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, మాడాక్ ఫిల్మ్స్ స్ట్రాటజీ చూస్తుంటే ఈ రెండు ప్రాజెక్ట్‌లు కూడా బిగ్ బ్లాక్‌బస్టర్స్ అవ్వడం ఖాయమనిపిస్తోంది.

కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ || Ys Jagan Sensational Comments On Pawan Kalyan || TR