Alia Bhat: నా సినిమా హిట్ కావడానికి పుష్ప చిత్రమే కారణం: ఆలియా భట్ షాకింగ్ కామెంట్స్

Alia Bhat: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , అందాల ముద్దు గుమ్మ రష్మిక మందన, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద ఎంత సునామీ సృష్టించిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా బన్నీ కెరీర్లో ఇప్పటి వరకు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా కూడా గుర్తింపు పొందింది. బన్నీ పొగరు, మ్యానరిజ, డైలాగులు, పాటలు అన్నీ కూడా ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా వచ్చాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా ఊహించని స్థాయిలో రావడం గమనార్హం. ఎంతో మంది ప్రముఖులు సైతం ఈ మూవీ బాగుందంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

అయితే పుష్ప సినిమా ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడంతో బన్నీకి కూడా సినీ పరిశ్రమలో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్ కథానాయికలు సైతం ఆయనతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్. అయితే తాజా బాలీవుడ్ నటి ఆలియా భట్‌ కూడా అల్లు అర్జున్‌ని, పుష్ప సినిమాను పొగుడుతూ పలు కామెంట్స్ చేసింది. ఈ సినిమా చూడగానే తాను బన్నీకి ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చింది. అంతే కాదు తాను చేసిన గంగూబాయ్ కతియావాడి సినిమాలో తన క్యారెక్టర్ అంత బాగా రావడానికి కూడా ఈ సినిమానే అంటూ ప్రశంసించింది.

తాను ఆ సినిమాకు ఓకే చెప్పినపుడు డైరెక్టర్ స్క్రిప్టు చేప్పినా కూడా, తన బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉండాలి ఈ పాత్రకు అన్న సందిగ్ధంలో పడ్డానని, ఆ సమయంలోనే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రిలీజైంది అలియా చెప్పుకొచ్చింది. ఆ సినిమా చూశాక తన క్యారెక్టర్‌ కూడా బన్నీ లాగా మాస్‌గా ఉండాలని ఇలా భిన్నంగా ట్రై చేశానని పేర్కొంది. ఫైనల్‌గా ఈ మూవీ చాలా పెద్ద హిట్‌ అయ్యి తనగు మరింత గుర్తింపును తీసుకొచ్చిందంటూ అలియా స్పష్టం చేసింది. కాబట్టి తన సినిమా సక్సెస్ కావడానికి పుష్ప సినిమానే కారణమని ఆమె మరో సారి నొక్కి చెప్పింది. ఇక ఇటీవల ఆమె నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కూడా పెద్ద హిట్ కావడంతో ఆమెకు ఇప్పుడు హిట్‌ కాలం సాగుతోందని పలువురు భావిస్తున్నారు. ఆలియా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో బన్నీతో ఈమె నటిస్తుందంటూ ఇప్పుడు నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అది నిజమో, కాదో చూడాలి మరి.