Chiranjeevi: బన్నీకి బర్తడే విషెస్ చెప్పిన మెగాస్టార్.. పార్టీ చేసుకో అంటూ ట్వీట్…ట్వీట్ వైరల్!

Chiranjeevi: పుష్ప సినిమా తర్వాత ఐకాన్ స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సుకుమార్ అమాంతం పెంచేశాడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ సినిమాలో రష్మిక చేసిన అల్లరి, ఆమె హావ భావాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక అల్లు అర్జున్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన డ్యాన్స్‌లతో, భిన్న డైలాగులతో అదరగొట్టేశాడు. తమ మ్యానరిజంతో కుర్రకారును ఉర్రూతలూగించాడు.

అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై బాక్సాఫీసును బద్దలు కొట్టింది. కోట్లల్లో వసూలూ రాబట్టి కలెక్షన్ల పరంగానూ భారీ సక్సెస్‌ను నమోదు చేసింది ఈ చిత్రం. ఇంతటి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బన్నీ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 హిట్ కొట్టడంతో, సుకుమార్ అదే ఉత్సాహంతో పార్ట్‌2కు తెరలేపాడు. దీంతో మళ్లీ ఈ సినిమా ఎలా ఉండబోతుందా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తన మేనల్లుడికి మెగాస్టార్ వినూత్నంగా విషెస్ చెప్పాడు. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్ మార్క్ పుట్టిన రోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో అని చిరు ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే 8800 మంది లైక్ చేయగా, సుమారుగా 2200మంది రీట్వీట్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే బన్నీ క్రేజ్ ఏ లెవల్‌లో ఉందో మరోసారి రుజువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.