సీమా హైదర్‌ నేపథ్యంలో ‘కరాచీ టు నోయిడా’ థీమ్ సాంగ్ విడుదల చేసిన మేకర్స్‌!

సీమా హైదర్‌ .. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పబ్జీ గేమ్‌ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌ విూనా కోసం తన నలుగురి పిల్లలతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు అక్రమ మార్గంలో ప్రవేశించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.

’కరాచీ టు నోయిడా’ పేరుతో అమిత్‌ జానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్ర థీమ్‌ సాంగ్‌ ’చల్‌ పడే హైన్‌ హమ్‌’ ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. ఢల్లీిలోని శంకర్‌ భారతీయ ఆడిటోరియంలో ఈ థీమ్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పాటను ప్రీతి సరోజ్‌ ఆలపించగా, నిర్మాత అమిత్‌ జానీ లిరిక్స్‌ రాశారు. కాగా, ఈ చిత్రంలోని సీమా హైదర్‌ పాత్రలో ఫర్హీన్‌ ఫలక్‌ నటిస్తోంది. ఈ చిత్రానికి శశాంక్‌ దుర్గ్వంశీ సంగీతాన్ని అందిస్తున్నారు. భరత్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా, ఈ పాట విడుదలైన గంటల వ్యవధిలోనే లక్షల మంది వీక్షించారు. ప్రస్తుతం ఈ పాట అన్ని మ్యూజిక్‌ ఎª`లాట్‌ఫామ్స్‌లో ట్రెండిరగ్‌లో ఉంది. కాగా, పాక్‌ జాతీయురాలైన 30 ఏళ్ల సీమా హైదర్‌.. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన 22 ఏళ్ల సచిన్‌ విూనాతో పబ్జీ గేమ్‌ ద్వారా ప్రేమలో పడిరది. అతడి కోసం నలుగురు పిల్లలతో సహా పాక్‌ సరిహద్దును దాటి భారత్‌ లోకి అక్రమంగా అడుగుపెట్టింది. అనంతరం సచిన్‌ విూనాను వివాహం చేసుకున్న సీమా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ లోని గ్రేటర్‌ నోయిడాలో నివాసముంటోంది.

మరోవైపు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్‌ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మామ పాకిస్థాన్‌ ఆర్మీలో సుబేదార్‌ కాగా, సోదరుడు కూడా పాక్‌ ఆర్మీలో సైనికుడని తెలిసింది. ఈ నేపథ్యంలో సీమా హైదర్‌ను పాకిస్థాన్‌ స్పైగా అనుమాని స్తున్నారు.