“సలార్” హైప్ ఈజ్ రియల్ అప్పుడే మాసివ్ రికార్డ్.!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ స్థాయిలో హైప్ ఉన్నటువంటి అసలు సిసలు పాన్ ఇండియా సినిమాలు కొన్నే ఉన్నాయి. మరి ఈ కొన్ని సినిమాల్లో అయితే పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి.

కాగా ఈ సినిమాల్లో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మాసివ్ ఏక్షన్ చిత్రం “సలార్” కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ సినిమాపై హైప్ ఇప్పటికి ఏ లెవెల్లో ఉంది అనేది క్లియర్ గా ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమాని ఎప్పుడో బుక్ మై షో లో పెట్టిన సంగతి తెలిసిందే.

మరి ఈ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ తో అప్పట్లోనే 50 వేల మందికి పైగా సినిమా కోసం ఇంట్రెస్ట్ లు చూపించగా టాలీవుడ్ నుంచి మొదటి సినిమాగా ఇది రికార్డు సెట్ చేసింది. ఇక ఇంకా సినిమాకి దాదాపు 6 నెలలు గ్యాప్ ఉన్నప్పటికీ అప్పుడే బుక్ మై షో లో లక్ష కి పైగా ఇంట్రెస్ట్ లు నమోదు అయ్యాయి.

దీనితో సలార్ పై రియల్ హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి తీరాలి. ఇక ఇప్పుడే ఇలా ఉంటే రేపు మరిన్ని అప్డేట్స్ వచ్చి సినిమా రిలీజ్ నాటికి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే ఈ సినిమా కూడా 1000 కోట్ల బాక్సాఫీస్ మార్క్ ని అందుకునే సినిమా అని ఇప్పుడు నుంచే ట్రేడ్ వర్గాలు వారు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కేజీఎఫ్, కాంతారా లాంటి సెన్సేషనల్ సినిమాలు చేసిన నిర్మాణ సంస్థ హోంబలె సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.