నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా “ది డీల్” మోషన్ పోస్టర్ విడుదల

ఈశ్వర్ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు వెండితెరకు పరిచయమైన హను కోట్ల. తొలి చిత్రంలో మూగ పాత్రలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత తన నటనను మరింత మెరుగుపరచుకోవాలనుకున్నారు. అలాగే దర్శకత్వ శాఖలో కూడా తన ప్రతిభను చూపించాలనుకున్నాడు..కానీ అప్పటికే హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉద్యోగరీత్యా బి.ఎ యాక్టింగ్, ఎం.ఎ. మీడియా డైరెక్షన్ కోర్సుల్లో విద్యార్థులకు బోధనా ఉపాధ్యాయుడిగా కొనసాగటం వల్ల ఈశ్వర్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తగిన పాత్ర కోసం ఎదురుచూశారు.. ఇప్పుడు ‘ది డీల్’ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం కాబోతున్నాడు.

ఆధునిక తెలుగు నాటక రంగంలో నటుడిగా, దర్శకుడి గా అనేక ప్రయాణాలు చేసి రంగస్థలం పై ఎన్నో విజువల్ వండర్స్ ని క్రెయేట్ చేసి తెలుగులో మొట్ట మొదటి నాటకత్రయం ‘ప్రతాపరుద్ర’ నాటకాన్ని మూడు భాగాలుగా ప్రదర్శించడం జరిగింది. నాటక రంగంపై జాతీయ, అంతర్జాతీయ సెమినార్ లలో పాల్గొని నాటక అధ్యాపకులుగా నటన, దర్శకత్వంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నారు..అంతే కాక నాటక రంగంలో ఎన్నో గొప్ప ప్రయోగాలకు నాంది పలుకుతూ తన కళలకి గుర్తింపు గా రాష్ట్ర ప్రభుత్వం చేత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుని గెలుచుకున్నారు…తనకున్న అపార అనుభవంతో ‘ది డీల్’ సినిమాని రూపొందించారు.. ఈ సినిమాని అక్టోబర్ నెలలో దసరా పండుగ సందర్భంగా విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకి సరికొత్త అనుభావాన్ని అందించబోతున్న హను కోట్లకి జన్మదిన శుభాకాంక్షలు.

సిటడెల్ క్రెయేషన్, డిజిక్విస్ట్ సంయుక్తంగా ‘ది డీల్’ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరో, దర్శకుడు డాక్టర్ హను కోట్ల పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండు బాగాలు గా రాబోతున్న ఈ మూవీ మొదటి భాగం మొత్తం హైదరాబాద్ లో.. కొంత మలేషియాలో చిత్రికరించామని, మలి భాగాన్ని మొత్తం మలేషియలో షూటింగ్ చేసి చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈ చిత్రం మొదటి భాగం దసరాకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ లుగా చందన, ధరణి ప్రియా నటించగా రఘు కుంచె, రవి ప్రకాష్, మహేష్ పవన్, గిరి, వెంకట్ గోవాడ, శ్రీవాణి, సుజాత దిక్షిత్, సురభి లలిత ముఖ్య పాత్రలు పోషించారు. కెమెరా సురేందర్ రెడ్డి, సంగీతం ఆర్.ఆర్. ధ్రువన్, ఎడిటర్ శ్రవణ్ కటికనేని సాంకేతిక నిపుణులుగా వ్యవహారించారు.