Bollywood: సినీ పరిశ్రమలో వారసత్వం అనేది సర్వసాధారణమైపోయింది. చాలామంది స్టార్ నటీనటులు వారి పిల్లలను వెండి తెరకు పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వారసులు వెండితెరపై తమదైన సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే జాన్వీకపూర్, సారా అలీ ఖాన్ వారసత్వాన్ని అనుసరించి వెండి తెరకు పరిచయం అయ్యారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు మాత్రం దీనికి వ్యతిరేకం అంటోంది. అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన తండ్రి వారసత్వాన్ని అనుసరించి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వదట.
కానీ ఐరా ఖాన్ ఇంస్టాగ్రామ్ లో తనదైన స్టైల్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రశ్నలు సమాధానాలు అనే సెషన నిర్వహించిన ఐరా ఖాన్ ఇంస్టాగ్రామ్ యూజర్స్ తో ముచ్చటించింది.
దీనిలో భాగంగా ఒక యూజర్ బాలీవుడ్ లో నటిగా మారాలి అన్న ఆలోచన ఉందా అని అడగగా దానికి ఐరా నేను సినిమాల్లోకి రావడం లేదు అని సమాధానం ఇచ్చింది. కాగా ఐరా గతంలో మీడియా అనే నాటకానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే, దీన్నిబట్టి ఐరా నటన పరంగా ఆసక్తి కనబరచడం లేదు కానీ దర్శకత్వం వహించే ఆలోచన ఉందేమో అని అందరూ అనుకుంటున్నారు.