ఊహించని విధంగా ఈ వారం ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్.. సిరి, ప్రియాంక సెఫ్

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 షో రసవత్తరంగా సాగుతోంది. చూస్తుండగానే బిగ్ బాస్ షో 12 వారాలు పూర్తి చేసుకొని 13 వ వారంలోకి అడుగు పెట్టింది. అయితే వారాలు దగ్గర పడే కొద్ది కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరుగుతోంది. అదేవిధంగా కంటెస్టెంట్ ల సంఖ్య కూడా తగ్గుతుంది. 12 వ వారం ఎలిమినేషన్ రానే వచ్చేసింది. దీనితో హౌస్ మేట్స్ కు ఉపశమనం కలిగించడానికి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్.

బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇవ్వడం తో కంటెస్టెంట్ లు అందరూ ఎమోషనల్ అయ్యారు. 12వ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యుల్లో ఒక్క మానస్ తప్పితే మిగతా అందరూ ఉన్నారు. అందులో సన్నీ, షణ్ముఖ్ లు నువ్వా నేనా అన్నట్లు గా ఓటింగ్ లో దూసుకుపోతున్నారు.

ఇక ఈ వారం మొదటి నుంచి ఎలిమినేషన్ లో ఐదుగురు డేంజర్ జోన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అందులో కాజల్,పింకీ, యాంకర్ రవి, సిరి, శ్రీ రామచంద్ర ఈ ఐదుగురు ఈవారం ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే మొన్నటి వరకు సిరి, ప్రియాంక సింగ్ లు ఎలిమినేషన్ లో ఉంటారు అని అనుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్త విన్న రవి అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రియాంక,కాజల్, సిరి కు ఎక్కువ ఓట్లు రావడం నమ్మకంగా లేదంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రవి ఫ్యాన్స్. తాజాగా రవి తన కూతురు తో మాట్లాడుతూ మరో మూడు వారాల్లో బయటకు వస్తానని చెప్పాడు. కానీ ఈ వారమే వెళ్ళి పోతుండడంతో హౌస్ సభ్యులు కూడా షాక్ కు గురయ్యారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడా లేదా తెలియాలి అంటే నేటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.