Tollywood: సంక్రాంతి బరిలో దిగనున్న పెద్ద హీరోల సినిమాలివే!

Tollywood: తెలుగు చలన చిత్ర రంగంకి సంక్రాంతి పండగ సీజన్ పెద్దది.పైగా టాప్ హీరోస్ కి సంక్రాంతి సెంటిమెంట్ కూడా ఉంది. ఇక చిన్నా పెద్దా తేడా లేకుండా సంక్రాంతి టైములో రిలీజ్ చేయడానికి చాలా సినిమాలు సిద్దమవుతుంటాయి. ఇపుడు ఏకంగా 4 పెద్ద సినిమాలు వచ్చే సంక్రాంతి బరిలో ఉండటం విశేషం.
ఆదిపురుష్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. 3డి లో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కి రిలీజ్ అవబోతున్న భారీ బడ్జెట్ మూవీ అవడం విశేషం.

రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న మూవీ కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేస్తామని సినిమా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇక ఎన్టీఆర్, RRR తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో మూవీ ని ఓకే చేసారు పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో విద్యార్థుల సమస్యల పై పోరాడే యువకుడి పాత్రలో ఎన్టీఆర్ నటించనున్నారు. ఈ సినిమా ను 2023 సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తోంది. అసలే సంక్రాంతి పండగ నందమూరి హీరోలకు అచ్చోచిన పండగ.

ఇక మెగా స్టార్ ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ సినిమాను ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.ఇక భోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమాలను కూడా లైన్ లో పెట్టేసారు చిరంజీవి.ఇక చిరంజీవి బాబీ డైరెక్షన్ లో చేయబోతున్న మూవీని సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నాలుగు పెద్ద హీరోల సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి బరి లో ఉన్నాయి. ఇక ఇందులో ఏవేవి వెనక్కుతాగ్గుతాయో ప్రస్తుతానికి తెలియదు కానీ అనుకున్నట్లు రిలీజ్ అయితే మాత్రం పండగ జోరు పెరిగినట్టే.