తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి ప్రస్తుతం చాలా తక్కువ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఒకానొక సమయంలో వరుస సినిమాలతో యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ సందడి చేసిన ప్రగతి ఈ మధ్యకాలంలో సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.కెరియర్ మొదట్లో హీరోయిన్ గా పలు తమిళ సినిమాలలో నటించిన ఈమె అనంతరం తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.
ఇలా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాలలో నటించిన ప్రగతి సోషల్ మీడియా వేదికగా తన వర్కౌట్ లకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు. అయితే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈమె తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశానని తెలిపారు.ఇలా తన జీవితంలో చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటి అనే విషయానికి వస్తే చాలా తొందరగా పెళ్లి చేసుకోవడమే తాను చేసిన పొరపాటని తెలిపారు.
తెలిసి తెలియని వయసులో ఎంతో అమాయకత్వంతో తాను పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని, ఇలా పెళ్లి అయిన తర్వాత నా జీవితం ఎన్నో ఇబ్బందులలో పడిన తర్వాత తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలపై ఫోకస్ పెట్టానని తెలిపారు.అయితే ఇదే ఫోకస్ తాను హీరోయిన్ గా చేసే సమయంలో కనుక చేసి ఉంటే ఇప్పటికి తన లైఫ్ మరోలా ఉండేదని పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని ఎందుకు తప్పనిసరిగా మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.