పెళ్లి చీరలో జాతీయ అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది అందాభామ అలియాభట్. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిరది. ‘ఆ చీర నాకు ప్రాణం. ఏదైనా పెద్ద ఈవెంట్ అయితే ముందు గుర్తొచ్చేది ఆ చీరే. నాకు నగలపై కూడా ఇంట్రెస్టుండదు. ఆ చీర అంటే మాత్రం ఎందుకో పిచ్చి. సాధారణంగా నాలాంటి ఆడవాళ్లు ఇలాంటి వేడుకల్లో కొత్తకొత్త డ్రస్సులో కనిపించాలనుకుంటారు.
నేను మాత్రం ఆ చీరలోనే కనిపించాలనుకుంటా. నాకు అదో తృప్తి’ అంటూ చెప్పుకొచ్చింది అలియా. తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తూ ‘ కుటుంబంతో ప్రశాంతంగా ఉండాలనుకుంటే ముఖ్యంగా మనం సోషల్‌విూడియాకు దూరంగా ఉండాలి. అక్కడి కామెంట్స్ చదివినా, చూసినా మనశ్శాంతి ఉండదు. అపోహలు, అపార్థాలు తలెత్తే ప్రమాదం ఉంది. నా అదృష్టం.. అర్థం చేసుకునే భర్త దొరికాడు’ అని ఆనందం వ్యక్తం చేసింది అలియాభట్