నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.
ఇకపోతే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో మాత్రం ఇప్పటికి ఒక్క కోరిక మాత్రం తీరలేదట. మరి ఆ కోరిక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని నిలబెడుతూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా తో పాన్ ఇండియా ఇందులో హీరోగా ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.
అయితే తనకు సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇంత సక్సెస్ ఫుల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నప్పటికీ ఎన్టీఆర్ కు మాత్రం ఒక తీరని కోరిక మిగిలిపోయింది. అదేమిటంటే ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆడపిల్ల పుడుతుందని జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారట. ఆడపిల్ల పుడితే నందమూరి వంశానికి ఆడపడుచు వస్తుంది అని అందరూ చాలా ఆశ పడ్డారట. కానీ రెండవసారి కూడా అబ్బాయి పుట్టడంతో కాస్త నిరాశ వ్యక్తం చేశారట. ఒకవేళ రెండోసారి ఆడపిల్ల పుట్టి ఉంటే కొడుకు కూతురితో ఫుల్ ఫీల్ అయ్యేది అని తెలిపారు తారక్. ఈ ఒక్క విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కు కోరిక తీరకుండానే అలాగే ఉండిపోయిందట.